సినిమా రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ సపోర్టర్స్.. మెగా ఫాన్స్ తప్పిస్తే మిగతా ఎవ్వరు కూడా పాజిటివ్గా మాట్లాడుకోవడం లేదు . మరీ ముఖ్యంగా శంకర్ కథని బాగా ట్రోల్ చేస్తున్నారు . అసలు ఈ సినిమాలో కథ ఏంటి ..? ఇలాంటి కథలు ఎన్నెన్నో ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ తెరకెక్కించేశారు.. మరి నువ్వు ఏమి కొత్తగా చూపించావు ..? ఒకప్పుడు 'ఒకే ఒక్కడు, అపరిచితుడు' లాంటి సినిమాలను తెరకెక్కించిన ఆ శంకర్ నేనా..? ఈ శంకర్ అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఒక నిజాయితీ గల ఆఫీసర్ కి ..అవినీతిపరుడైన మంత్రికి మధ్యన జరిగిన పోరాటమే ఈ స్టోరీ అన్న విషయం అందరికీ బాగా అర్థం అయిపోయింది . ఇలాంటి సినిమాలు ఇప్పటికే బోలెడు చూశాం.
కొంచెం అటు ఇటుగా హాట్ గా మారుద్దామనుకున్న శంకర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు . అంతేకాదు ఈ సినిమా చూసిన తర్వాత ఓల్డ్ శంకర్ ని మిస్ అయిపోతున్నాం అంటూ కూడా జనాలు కామెంట్స్ పెడుతున్నారు. మరీ ముఖ్యంగా మీమ్‌స్ అయితే ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నారు. ఒకానొక సందర్భంలో శంకర్ పోకిరి , ఒక్కడు సినిమాల మాదిరి తాను కమర్షియల్ సినిమా తీయాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గేమ్ చేంజర్ సినిమాకి.. పోకిరి , ఒక్కడు సినిమా ఏ రకంగా సెట్ కాదు అంటున్నారు జనాలు .
అంతేకాదు పోకిరి , ఒక్కడు సినిమా కాలం మారిపోయిందని . ఇప్పుడు జనాల మైండ్ సెట్ బాగా చేంజ్ అయ్యిందని.. ట్రెండ్ కి తగ్గట్టు ముందుకు వెళ్తున్నారు అని .. ఇంకా కూడా పాత బ్రేకింగ్ సినిమాల మాదిరే శంకర్ సినిమాను తెరకెక్కిస్తే ఎవరు చూడరని కామెంత్స్ చేస్తున్నారు . అంతేకాదు ప్రెసెంట్ యువత అభిరుచులు మారిపోయాయి . ప్రేక్షకుల ఆలోచన సరళిని బట్టి కథలు తెరకెక్కించాలి. అందులో హీరోయిజం కూడా మారాలి అంటున్నారు జనాలు. దురదృష్టవశాత్తు గేమ్ చేంజర్ లో అది మిస్సయింది.
కాగా సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే ఇది ఒక ఆరో తరగతి సోషల్ పాఠం అంటూ కూడా మీమ్‌స్ ట్రోల్ చేస్తున్నారు . కలెక్టర్ ఎవరు..? ఆయన అధికారాలు ఏంటి ..? అని తెలుసుకోవడానికి ఈ సినిమా చూడాలా..? "ఒక సోషల్ బుక్ ఎత్తుకొని చదివితే పోలే "అంటూ కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . అంతేకాదు చిన్నపిల్లలకి సైతం ఈ విషయం తెలుసు అని .. కానీ శంకర్ అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు . శంకర్ ఇకనైనా ఓల్డ్ థాట్స్ ను మానేసి న్యూ జనరేషన్ కి వస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా మొదటి రోజు 185 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ చెబుతున్నారు.. కానీ ఇదంతా ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు జనాలు. మొత్తానికి శంకర్ ఏదో అనుకుంటే మరేదో జరిగింది.. చూడాలి మరి శంకర్ ఖాతాలో నెక్స్ట్ బలైపోయే హీరో ఎవరు అనేది..!?