సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ నీ ఫాలో అయ్యే వాళ్ళు చాలా చాలా తక్కువ . మరీ ముఖ్యంగా ఒకరో ఇద్దరో మాత్రమే అలా సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు . హీరోలు చాలామంది సెంటిమెంట్ లేకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు . మరీ ముఖ్యంగా మహేష్ బాబు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  తన సినిమా పూజా కార్యక్రమాలకి ఆయన అటెండ్ అయితే ..ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న నమ్మకం ఆయనకు ఎక్కువగా ఉంది . ఆ కారణంగానే తను నటించే సినిమా పూజా కార్యక్రమాలకు అసలు హాజరవ్వడు . కాగా మెగా హీరోస్ మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోరు .


అయితే జనవరి నెలలో రిలీజ్ అయితే ఆ సినిమా  నెగటివ్ టాక్ సంపాదించుకుంటుంది మెగా హీరోస్ కి సంబంధించి అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి కారణం "గేమ్ చేంజర్" సినిమా . దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వచ్చిన సినిమా ఇదే కావడం గమనార్హం . దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇదే కావడంతో సినిమాపై ఒకింత ఆసక్తి నెలకొంది.  కానీ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. మిక్స్డ్ టాక్ దక్కించుకుంది . దీంతో గేమ్ చేంజర్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయింది . మీమ్‌స్ అయితే అల్లాడించేస్తున్నారు . ఇదే క్రమంలో జనవరి 10వ తేదీ మెగా ఫ్యామిలీకి అచ్చి రాలేదు అన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి .



సరిగ్గా ఏడేళ్ల క్రిందట జనవరి 10 "అజ్ఞాతవాసి" సినిమా రిలీజ్ అయింది.  పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రమే ఈ "అజ్ఞాతవాసి" . ఈ సినిమా ఇచ్చిన ఫ్లాప్ నుండి ఇప్పటికి పవన్ కళ్యాణ్ కోల్కోలేకపోతున్నాడు.  2018 సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.  పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండి పోవాల్సిన డిజాస్టర్ మూవీగా ఈ సినిమా మిగిలిపోయింది .



ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో బాధపడుతూనే ఉంటారు . అంతేకాదు ఇప్పుడు అజ్ఞాతవాసి రికార్డును బ్రేక్ చేసే విధంగా గేమ్ చేంజర్ మూవీ ఫ్యాన్స్ ని నిరోత్సాహపరుస్తుంది అంటున్నారు జనాలు . అంతేకాదు 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన "వినయ విధేయ రామ" సినిమా కూడా డిజాస్టర్ టాక్ అందుకుంది . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి సంక్రాంతి రేస్ కలిసి రావడం లేదు అని  అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: