గత సంవత్సర కాలం నుంచి మహేష్ బాబు లుక్స్ కోసం.. సరైన లొకేషన్స్ కోసమే టైం మొత్తం ఖర్చు చేసేసాడు రాజమౌళి . కాగా ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీకి మరొక ఆస్కార్ అవార్డు తీసుకొస్తుంది అంటూ ఫ్యాన్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి . ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా బడా బడా స్టార్స్ కూడా ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అలాంటి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా సింపుల్ గా ఫినిష్ చేయడం అందరికీ షాకింగ్ కా అనిపించింది .
రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా పూజా కార్యక్రమాలు రీసెంట్గా జరిగిపోయాయి . అయితే సినిమా బృందం నుంచి ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. రాజమౌళి అండ్ టీం మొత్తం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీని తమ స్థావరంగా చేసుకొని అక్కడే దాదాపు అన్ని పనులను పూర్తి చేసేస్తుంది . అక్కడే పూజను కూడా కంప్లీట్ చేసేసారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ గా మారింది . ఇది శూన్యమాసం అంటారు .. పుష్యమాసం ప్రారంభమయ్యాక .. సంక్రాంతి వరకు శూన్యవాసం అని పిలుస్తూనే ఉంటారు.
హిందూ సంప్రదాయ ప్రకారం ఈ శూన్యమాసంలో ఎటువంటి మంచి పనులు చేయరు . పూజలు .. గృహప్రవేశాలు .. ఫంక్షన్స్ లాంటివి అస్సలు చేయకూడదు అని హిందూ ముహూర్తాల గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు . అయితే రాజమౌళి అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవ్వరు . కానీ కీరవాణి ఇలాంటి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు . ఇవన్నీ కీరవాణికి బాగా తెలుసు . అయితే శూన్యమాసంలో అలా ఎలా పూజ స్టార్ట్ చేస్తారు ..?అంటూ చాలామంది మహేష్ బాబు అభిమానులు పరోక్షకంగా రాజమౌళి పై ఘాటు కౌంటర్స్ వేశారు. దీనికి రాజమౌళి ఫ్యాన్స్ సైతం అదే విధంగా ఘాటుగా జవాబు ఇస్తున్నారు.
నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో కంప్లీట్ అయిపోయాయట . ఈ సినిమా తెర వెనుక పనులు దాదాపు ఆరు నెలల నుంచి స్టార్ట్ చేశారట . చిన్న పూజతో ఇలాంటి చిన్న చిన్న పనులు ప్రారంభించేసారట . అంటే స్క్రిప్ట్ డిస్కషన్లు.. స్టోరీ బోర్డ్ లు.. లొకేషన్ లు.. రెక్కీలు .. కాస్టింగ్ డిస్కషన్లు .. అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయట . ఇది బడా సినిమా కావడంతో అఫీషియల్ గా అందరికీ తెలియజేసే విధంగానే ఈ విధంగా పూజ నిర్వహించారట.
అయితే ఇది శూన్య మాసంలో ప్రారంభించిన పూజ కానేకాదు అంటున్నారు . అంతేకాదు రాజమౌళి సైతం ఈ వార్త విని కోప్పడ్డారట . టాలెంట్ ని నమ్ముకోవాలి కానీ ఇలా పుష్యమాసం.. శూన్యమాసం అంటూ లెక్కలు వేసుకుని కూర్చుంటారా..? అంటూ మూవీ టీం పై కూడా ఫైర్ అవుతూ టెక్నాలజీ పెరిగింది.. ట్రెండ్ మారింది .. మనుషులు కూడా మారాలి అనే విధంగా చెప్పకొచ్చారట . కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ , మే నుంచి సెట్స్ పైకి రాబోతుందట . అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్ అదే విధంగా ఒక ఫారెన్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది..!