అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం పడుతుందని ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది .. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించారని కూడా అంటున్నారు. ఇదే క్రమంలో తొందరపడి సినిమాను రిలీజ్ చేయకూడదని అభిప్రాయం మేకర్స్ లో ఉందని తెలుస్తుంది .. దీంతో అనుకున్న తేదీ కంటే కనీసం మూడు నెలలు ఆలస్యంగా ది రాజా సాబ్ సినిమాను రిలీజ్ చేస్తారని టాక్.
ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది . ప్రస్తుతం ప్రభాస్ గాయం కారణంగా కొంత షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు .. ఇప్పుడిప్పడే రీసెంట్ గానే పలు షూటింగ్లకు జాయిన్ అవుతున్నాడు . ఇందులో భాగంగానే ది రాజా సాబ్ లో ప్రభాస్ కు సంబంధించిన కొంత షూటింగ్ పెండింగ్లో ఉంది .. ఇప్పుడు ఆ షూటింగ్ చేయడానికి ప్రభాస్ ఇంకాస్త టైం తీసుకుంటున్నారని కూడా అంటున్నారు .. అందుకు పలు కారణాలు కూడా బయటకు వస్తున్నాయి .. ముందుగా ఈ సినిమాని పాన్ ఇండియ సినిమాగా మొదలు పెట్టలేదు .. ఆ తర్వాత సలార్ , కల్కి సినిమాలతో ప్రభాస్ ఫామ్ లోకి వచ్చాడు .. దింతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు .. ఇప్పుడు ఈ రిలీజ్ కి ప్రభాస్ నో చెప్పారని కూడా అంటున్నారు .. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా వేయాలని కూడా చిత్ర యూనిట్ భావిస్తుంది. ప్రభాస్ ఈ సినిమాపై రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.