అయితే ఇప్పుడు ఏ సినిమా తీయాలన్నా చాలా సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు . అలాగే థియేటర్లో విడుదలయ్యాక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తుందా లేదా అనే గ్యారెంటీ కూడా లేదు .. ప్రస్తుతం చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఊహించని ప్లాప్‌లుగా మిగిలిపోతున్నాయి .. కానీ కౌన్ సినిమా చేయడానికి కేవలం 15 రోజుల సమయం మాత్రమే తీసుకున్నారు .. ఇక ఈ సినిమాని రాంగోపాల్ వర్మ తెరకెక్కించగా అనురాగ్ కశ్యప్ కథను అందించారు .. ఈ సినిమా కథ ఎంత ఎఫెక్టివ్‌గా ఉందంటే 26 ఏళ్ళు తర్వాత కూడా ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే .. ఒక ఇంట్లో ఒంటరిగా ఉండే ఒక అమ్మాయి అప్పుడే ఇద్దరు అబ్బాయిలు ఆమె ఇంటికి వస్తారు. వారిద్దరూ ఒక్కడా ఒక్కరి తర్వాత ఒకడు చనిపోతారు క్లైమాక్స్‌లో అందరినీ ఎవరు చంపుతున్నారో తెలుస్తుంది. అంతే కాదు, సినిమాలో ఊర్మిళా మటోండ్కర్ చాలా నేచురల్‌గా నటించిందని ప్రశంసలు వచ్చాయి. IMDB ప్రకారం, ఈ చిత్రంలో ఊర్మిళ పాత్రకు పేరు లేదు. సినిమా అంతా ఆమెను మేడమ్ అని పిలుస్తారు.. మీరు కూడా ఈ సినిమాని ఒకసారి యూట్యూబ్ లో చూసేయండి