శంకర్ .. ఈ పేరు ఒకప్పుడు ఓ బ్రాండ్ .  ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు .. కానీ కొన్నాలుగా అయిన స్థాయి సినిమా ఒకటి కూడా బాక్సాఫీస్ దగ్గరికి రాలేదు .. రోబో తర్వాత శంకర్ చేసిన స్నేహితుడు, విక్రమ్‌తో తెరకెక్కించిన ఐ తెలుగులో ప్లాప్ తమిళంలో మాత్రం కమర్షియల్ గా సేఫ్ అయింది .. ఇక భారీ అంచ‌నాల‌మధ్య వచ్చిన రజనీకాంత్ 2.0 కూడా అంతగా మెప్పించలేకపోయింది .. ఇక గత ఏడాది విడుదలైన ఇండియన్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది .. ఇప్పుడు తాజాగా గేమ్ చేంజ‌ర్‌ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శంకర్ ..


అయితే ఇప్పుడు ఈ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఫలితం పైన శంకర్ కెరియర్ ఆధారపడి ఉంది .. ఈ మధ్య ఎక్కువగా  విఎఫ్ఎక్స్ సినిమాలు చేసిన శంకర్ చాలా కాలం తర్వాత ఓ పొలిటికల్ సినిమా చేశారు . ఇక గేమ్ చేంజర్‌ తర్వాత ఇండియన్ 3 కూడా రిలీజ్ కు రెడీగా ఉంది గేమ్ చేంజర్ హిట్‌ అయితే ఇండియన్ 3కిి మళ్ళీ కొంత క్రేజ్‌ వస్తుంది ... అదే జరగాలని అందరూ కోరుకుంటున్నారు .. ఇప్పుడు వీటి తర్వాత ప్రాజెక్టుకు ఇప్పటినుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు శంకర్ ..  


వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా మూడు భాగాలతో శంకర్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు . నిజానికి  వీరయుగ నాయగన్ వేల్పరి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమాను శంకర్ కూడా ఎప్పుడో ఒకే చేశారు .. గేమ్ చేంజ‌ర్‌ స్క్రిప్ట్ లో సాయం చేసిన మదురై ఎంపీ వెంకటేశన్ రాసిన నవల లో వేల్పరి నేపథ్యం ఉంది .. దీన్ని కూడా తన సినిమా కోసం వాడుకోబోతున్నారు శంకర్ ..  గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఆడితే.. శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వేల్పరి ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాలో ఉన్న సూపర్ స్టార్స్‌తో ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: