రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంటుంది. గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. రామ్ చరణ్ డ్యూయల్ పాత్ర పోషించారు. గేమ్ చేంజర్ సినిమా విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా విడుదలైన ఒక్క రోజులోనే రూ. 186 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం అధికారికంగా రిలీజ్ చేసింది. 

ఇది గేమ్ చేంజింగ్ బ్లాక్ బస్టర్ అంటూ చిత్ర బృందం పేర్కొన్నారు. గేమ్ చేంజర్ సినిమాను రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంటుంది. కొంతమంది ఈ సినిమాను బాగుందని చెబుతుంటే మరికొంతమంది చాలా వరస్ట్ గా ఉందని అంటున్నారు. శంకర్ దర్శకత్వం అస్సలు బాగోలేదని చెబుతున్నారు.


ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు అన్ని నిరాశగా మారిపోయాయి. రామ్ చరణ్ నటన కూడా అస్సలు బాగోలేదని కొంతమంది అంటున్నారు. ఇక హీరోయిన్ గా కియారా అద్వానీ యావరేజ్ గా నటించిందని అంజలి మాత్రం అద్భుతంగా నటించిందని చెబుతున్నారు.

 కాగా, ఈ సినిమా ప్రదర్శించిన థియేటర్ల యాజమాన్యానికి షాక్ తగిలింది. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని జిఎం పిక్చర్ ప్యాలెస్ సినిమా థియేటర్ ప్రభుత్వ నిబంధనల మేర లైసెన్స్ తీసుకోలేదు. సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తుండడంతో డోన్ ఆర్డిఓ  థియేటర్ ను సీజ్ చేశారు. దీంతో రామ్ చరణ్ సినిమా ఆగిపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇదివరకే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు సీరియస్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: