"గేమ్ ఛేంజర్" సినిమా నిన్న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా అందాల ముద్దుగుమ్మ కీయర అద్వానీ హీరోయిన్గా తెలుగు హీరోయిన్ అంజలి మరొక బ్యూటీగా నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఒక్క మెగా ఫ్యాన్స్ తప్పిస్తే మరి ఎవరు కూడా ఈ సినిమాపై పాజిటివ్గా స్పందించడం లేదు . అంత డబ్బులు అసలు దిల్ రాజు ఈ సినిమాలో ఏం చూసి పెట్టాడు..? అంటూ రివర్స్ కౌంటర్స్ కూడా వేస్తున్నారు . కాగా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. అయితే చాలామంది ఈ సినిమాలో పాటల లొకేషన్స్ కోసం కూడా థియేటర్కు వెళ్లారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు .
అయితే చాలామంది జనాలు నానా హైరానా పాట కోసమే ఈ సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్లారు . సినిమా మొత్తం కంప్లీట్ అవుతున్న సరే "నానా హైరానా" పాట మాత్రం రాలేదు. దీంతో ఫ్యాన్స్ కూసింత డిస్సపాయింట్ అయ్యారు . అయితే జనవరి 14 నుంచి ఆ పాటను జోడించి మళ్లీ థియేటర్స్ లో ప్రదర్శిస్తామని మూవీ టీం చెప్పుకు వచ్చింది . సాంకేతిక కారణాల వల్ల మెరుగైన క్వాలిటీ కోసం ఆలస్యమైంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది . దీనితో ఫాన్స్ కోపం చల్లారిన కామన్ పీపుల్స్ మాత్రం టికెట్ రేట్ బొక్క అనే విధంగా కామెంట్స్ చేస్తూ వచ్చారు.
అయితే గేమ్ ఛేంజర్ లో "నానా హైరానా" పాట సెట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ లోనే ఆ ఛాన్స్ ఉంటుంది . కానీ నిడివి దృష్ట్యా ఇప్పుడు ఆ పాట్ ని జోడిస్తే అది టాప్ పై మరింత ప్రభావం చూపించే అవకాశం లేకపోనూ లేదు . ఎందుకంటే నానా హైరా అనే పాట చాలా ఖరీదైనది . అరుదైన విదేశీ లొకేషన్ లలో భారీ బడ్జెట్ తో షూట్ చేశారు. " జరగండి జరగండి" పాట తర్వాత అంత మొత్తంగా ఖర్చు పెట్టింది ఈ పాటకే అంటూ మూవీ టీం కూడా చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ - కియరా కెమిస్ట్రీ కూడా ఈ పాటలో బాగా వర్క్ అవుట్ అయిందట . అయితే తెర మీద ఈ పాట చూడకపోవడంతో కొంత నిరాశ వ్యక్తం చేశారు ఫ్యాన్స్. కాగా గతంలో తారక్ కూడా సేమ్ ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేశాడు . గత ఏడాది తారక్ నటించిన "దేవర" సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమాలో "దావూదీ" పాటకి కూడా అచ్చం ఇలాగే జరిగింది . ఆ తర్వాత పది రోజుల తర్వాత పాట యాడ్ చేయడం ఆ తర్వాత ఈ సినిమాకి కూసింత పాజిటివ్ టాక్ రావడం మనకు తెలిసిందే. ఇప్పుడు 'గేమ్ చేంజఋ విషయంలోను అదే జరగబోతుంది అంటున్నారు జనాలు. ఈ పాట యాడ్ చేసిన తర్వాత సినిమా కలెక్షన్స్ అదేవిధంగా సినిమా టాక్ రెండు కూడా మారిపోతాయి అంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ హీరోస్ కి ఇలాంటి ఒక పరిస్థితి రావడం చాలా దారుణం అంటూ కూడా మీమర్‌స్ ఆడేసుకుంటున్నారు..!