ఇక ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా అభిమానులు చూస్తూనే ఉంటారు .. అందుకే ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుండని ఎప్పటికప్పుడు ఆశ పడుతూ ఉంటారు .. అని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే మహేష్ , సుకుమార్ కాంబినేషన్లో రెండో సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అయ్యుండేది .. పుష్పా కంటే ముందే మహేష్ బాబుతో ఓ సినిమాను ప్రకటించాడు సుకుమార్ అప్పట్లో ఇదురు కలిసి అనాన్స్ చేసిన సినిమా ఊహించని విధంగా ఆగిపోయిందిది .. ఇక అప్పుడే పుష్పాను లైన్ లోకి తీసుకువచ్చాడు .. అలా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు .. అయితే ఆ గ్యాప్ లో మహేష్ , అనిల్ రావుపూడి , పరుశురాం , త్రివిక్రమ్ లాంటి దర్శకులతో సినిమాలు చేశాడు .. ఇక పుష్ప2 తర్వాత సుకుమార్ రేంజ్ ఎలా పెరిగిందో కొత్తగా చెప్పక్కర్లేదు.
ఇక ఇప్పుడు ఇలాంటి సమయంలో మహేష్ , సుకుమార్ కాంబినేషన్లో సినిమా పడితే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు .. ఊహకు అందని రేంజ్ లో ఉంటుందని అభిమానులు అంటున్నారు .. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది అని కూడా అనుకోవచ్చు .. తాజాగా సుకుమార్ భార్య తబిత సుకుమార్ నిర్మించిన గాంధీ తాత చెట్టు ట్రైలర్‌ను మహేష్ రిలీజ్ చేశారు .. ఆ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు కూడా బయటికి వచ్చాయి .. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం చూశాక మరోసారి కలిసి పనిచేస్తారని వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంబోలో సినిమా చూడాలంటే మరో మూడేళ్ళు సమయం ఆగాల్సిందే .. ప్రస్తుతం రాజమౌళితో సినిమా కమిటయ్యాడు మహేష్ .. అలాగే మరో వైపు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు .. మరి ఈ కాంబినేషన్ ఎప్పటికీ సెట్ అవుతుందో చూడాలి.