దానికి ప్రధాన కారణం కొద్దిసేపటి క్రితమే "గేమ్ చేంజర్" సినిమాకి సంబంధించిన మొదటి కలెక్షన్స్ బయటకు రావడం. రీసెంట్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా "గేమ్ చేంజర్" మొదటి రోజు కలెక్షన్స్ ని అఫీషియల్ గా ప్రకటించింది . వరల్డ్ వైడ్ 186+ కోట్లు 'గేమ్ చేంజర్" సినిమా కలెక్ట్ చేసింది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం . దీంతో జనాల మైండ్ బ్లాక్ అయిపోయాయి . అసలు ఈ సినిమాలో ఏముంది ..? నిజంగానే 186 కోట్లు ఈ సినిమాకి వచ్చాయా..? లేకపోతే కావాలని అలా నెగిటివ్ టాక్ ని కప్పి పెడుతూ.. ఫేక్ కలెక్షన్స్ లను బయటపెడుతున్నారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు.
దానికి ప్రూఫ్స్ కూడా బయటపెడుతున్నారు . ఆల్మోస్ట్ ఆల్ 'గేమ్ చేంజఋ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని థియేటర్లలో టికెట్స్ బుక్ అవ్వకుండా సీట్లు ఖాళీగానే ఉన్నాయి . ఒక థియేటర్ ఆక్యూపెన్సీ లో సగానికి పైగానే సీట్స్ ఖాళీగా ఉండడం.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అని కూడా మీమర్స్ బాగా వాడేసారు . మరి అన్ని థియేటర్లలో అన్నన్ని సీట్లు ఖాళీగా ఉంటే సినిమాకి కలెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..? 186 కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ..? ఇది ఏమి జిమ్మిక్కు..? అంటూ విపరీతంగా 'గేమ్ చేంజర్"ని ఆడేసుకుంటున్నారు . మధ్యలో ప్రొడ్యూసర్ దిల్ రాజును కూడా ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . నిజంగానే "గేమ్ చేంజర్" సినిమా 186 కోట్లు కలెక్ట్ చేసిందా..? లేకపోతే ఇదంతా తెరవెనుక జరిగిన మ్యాజిక్ నా..? ఏమో ఆ నిజానిజాలు ఆ వెంకటేశ్వర స్వామీకే తెలియాలి. మొత్తానికి "గేమ్ చేంజర్" సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకున్న కలెక్షన్స్ పరంగా 186 కోట్లు అంటూ చెప్పుకు రావడంతో మెగా ఫాన్స్ కు కూసింత ఊపిరి పీల్చుకునే విధంగానే సిచ్యువేషన్ కనిపిస్తుంది..!