ఈ క్రమంలోనే తాజాగా విదేశీ బీచ్ లో బికినీ అందాలతో చెమటలు పట్టించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి." జీవితం ఉన్నది ఒకటే.. దానిని తనివి తీరా ఆస్వాదించు సోదరా" అంటూ సదరు భామలు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఇప్పుడు ప్రజలు సైతం బాగా అర్థం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇటీవలే పెళ్లయి ఒక బిడ్డకు తల్లి అయిన ఈమె తన అందం విషయంలో ఏమాత్రం జోరు తగ్గించలేదని తెలుస్తోంది. తాజాగా బీచ్ లో అడ్వెంచర్స్ చేస్తూ కనిపించింది. స్విమ్ సూట్ లో ఉన్న ఆలియా భట్ థాయిలాండ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది.
ఇటీవలే కుటుంబ సమేతంగా ఆ థాయిలాండ్ వెళ్లిన ఈమె అక్కడ కొన్ని ఫోటోలను దిగి వాటిని అభిమానులతో పంచుకుంది. సముద్రం మధ్యలో థ్రిల్లింగ్ స్పీడ్ బోట్ రైడుకు వెళ్ళిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక సోదరి షాహీన్ తో ఆమె ఆన్ పాయింట్ సెల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పవచ్చు. అంతేకాదు థాయిలాండ్ వెకేషన్ లో తాను బస చేసిన చోట జిమ్ కి కూడా వెళ్ళింది. సైక్లింగ్ చేసింది. ఆ ఫోటోలు అన్నింటిని కూడా ఈమె షేర్ చేసింది. మొత్తానికైతే తన అందాలతో అందరినీ అబ్బురపరిచింది ఈ ముద్దుగుమ్మ.