అయితే కొందరు మాత్రం ఈ మీటింగ్ ను తప్పుగా మాట్లాడుతున్నారు . ఆల్రెడీ సంజయ్ లీల భన్సాలూ బాలీవుడ్ హీరోస్ రన్బీర్ కపూర్ - విక్కీ కౌశల్ తో ఓ సినిమాని తీస్తున్నారట . ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట . అయితే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసమే అల్లు అర్జున్ ని ముంబైకి పిలిపించుకొని మీట్ అయ్యారు అంటూ ఓ టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే మన టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ బాలీవుడ్ సెకండ్ క్యాటగిరీలోకి మార్చేసినట్లే అంటున్నారు జనాలు .
బన్నీ అగ్ర హీరోగా సినిమా చేస్తే బాగుంటుంది ..ఏదో సైట్ క్యారెక్టర్ల పక్క హీరోల సినిమాలలో మన స్టార్ హీరో నటిస్తే ఏం బాగుంటుంది..? అంటూ మాట్లాడుకుంటున్నారు. అసలు సంజజయ్ లీల భన్సాలీ మన ఐకానిక్ స్టార్ ని ఎలా సైట్ క్యారెక్టర్ లో చూపిస్తాడు..? ఆ డేర్ చేయగలరా ..? అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ సైడ్ క్యారెక్టర్ లో కనిపించే హీరో రోల్ ని మిస్ చేసుకుంటే బాగుంటుంది అని ..ఒకవేళ ఆయన లీడ్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం చేయడం మేలు అంటూ చెప్పుకొస్తున్నారు. అల్లు అర్జున్ - సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో నటించాలి అనే కోరికతో ఎటువంటి క్యారెక్టర్ లో నటించడానికి అయినా ఓకే చెప్పితే మాత్రం అల్లు అర్జున్ పరువు సంక నాకి పోతుంది అని .. ఇక పాన్ ఇండియా ఇమేజ్ కాపాడడం .. ఆ దేవుడు వంతు కూడా కాదు అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!