మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో సంక్రాంతి హీరో అన్నీ ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణను అనేవారు .. సంవత్సరం తిరగకుండానే కచ్చితంగా పెద్ద పండక్కి కనీసం ఒక్క సినిమా అయినా ఉండేలా కృష్ణ చూసుకునేవారు .. ఆ తర్వాత ఆ బిరుదు నట సింహం బాలకృష్ణకు దక్కింది .. ఈ స్టార్ హీరో తన కెరియర్ మొద‌టి నుంచి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది .. ప్రధానంగా తన సినిమాలను వీలైనంతవరకు పండక్కి తీసుకువచ్చేలా ఎక్కువ ప్లాన్ చేసుకుంటాడు బాలయ్య .. అలాగే అప్పుడు వచ్చిన ఆయన సినిమాలకు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తాయి .. కొన్నిసార్లు ఏకంగా ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాడు బాలయ్య .. ఇక నట సింహం కెరీర్ను మార్చేసి ఆయన్ను మరో మెట్టు ఎక్కించిన సినిమాల్లో అధిక భాగం సంక్రాంతికి వచ్చినవే .. అందుకే బ్లాక్ బస్టర్ బాలయ్య అని కూడా అంటారు .. అయ‌న సినిమా సంక్రాంతికి వచ్చింది అంటే .. అది ఇండస్ట్రీ హిట్ అనేది సెంటిమెంట్ ఈ రీసంట్‌ టైమ్స్ లో బాగా పెరిగింది .. కచ్చితంగా రెండేళ్లకు ఒక్కసారైనా సంక్రాంతికి తన సినిమాను తీసుకొస్తున్నాడు బాలయ్య.


కెరీర్ మొదట్లో తొలిసారిగా బాలయ్య జనవరి 11, 1985లో తొలిసారిగా ఆత్మబలం సినిమాతో సంక్రాంతికి వచ్చాడు .. అయితే బాలయ్య సోలో హీరోగా సంక్రాంతికి వచ్చిన సినిమా ఇదే.. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించలేకపోయింది.. అయితే ఆ తర్వాత 1987 జనవరి 14న మరోసారి భార్గవ రాముడు సినిమాతో సంక్రాంతికి వచ్చాడు బాలయ్య .. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మినిమం హిట్ గా నిలిచింది .. ఆ తర్వాత మళ్లీ జ‌న‌వ‌రి 17 , 1988 లో మరోసారి ఇన్స్పెక్టర్ ప్రతాప్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు .. ముత్యాల సుబ్బయ్య తెర్కక్కించిన ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు .. ఈ మూవీతో తొలి సంక్రాంతి విజయం అందుకున్నాడు .. అలాగే 1989 జనవరి 15న మరోసారి భలే దొంగ సినిమాతో సంక్రాంతి పండక్కు వచ్చి మంచి విజ‌యం అందుకున్నాడు.. ఈ సినిమాను కూడా కోదండరామిరెడ్డి తెర్కక్కించారు .. అలాగే 1990 జనవరి 12న మరోసారి ప్రాణానికి ప్రాణం అనే సినిమాతో సంక్రాంతికి వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం అందుకోలేదు.


అలాగే 1996 జనవరి 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన వంశానికి ఒక్కడు కూడా సంక్రాంతికి వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది .. 1997 జనవరి 10 పెద్దన్నయ్య సినిమాతో సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ విజయ అందుకున్నాడు బాలయ్య. ఇక 1999 లో వచ్చిన సంక్రాంతికి సమరసింహారెడ్డి సినిమాతో వచ్చి హిస్టరీ క్రియేట్ చేశాడు బాలయ్య .. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా .. అలాగే అప్పటివరకు ఉన్న కలెక్షన్ రికార్డులన్నీ తిరగరాసి టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని విజ‌యంగా నిలిచింది. అలాగే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది .. 2000 సంవత్సరంలో వచ్చిన సంక్రాంతికి వంశోద్ధారకుడు సినిమాతో వచ్చిన బాలయ్య ఈసారి భారీ ప్లాప్‌ను అందుకున్నాడు .. మరోసారి బిగోపాల్ దర్శకత్వంలో నరసింహనాయుడు సినిమాతో 2001 సంక్రాంతికి వచ్చి మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశాడు.


అలాగే తర్వాత 2002లో మరోసారి సంక్రాంతికి సీమ సింహం సినిమాతో వచ్చాడు .. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. మళ్లీ 2004లో లక్ష్మీనరసింహ సినిమాతో మరోసారి సంక్రాంతి పోటీలో దిగి విజయం అందుకున్నాడు బాలయ్య. తర్వాత 2008లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఒక్కో మగాడు సినిమా సంక్రాంతి సినిమాలోనే బాలయ్యకు భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది .. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వంలో 2011లో వచ్చిన పరమవీరచక్ర సినిమా కూడా ఆ సంక్రాంతికి వచ్చి నిరాశపరిచింది. ఇక మళ్లీ 2016లో డిక్టేటర్ సినిమాతో సంక్రాంతికి వచ్చి మినిమం హీట్ అందుకున్నాడు. ఇక 2017 సంక్రాంతికి బాలయ్య 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చి బంపర్ హిట్ అందుకుంది. ఇక 2018 సంక్రాంతి కూడా జైసింహ సినిమాతో బాలకృష్ణ మరోసారి మరో విజయం అందుకున్నాడు. ఇక 2019లో ఎన్టీఆర్ బయోపిక్ గా వ‌చ్చిన‌ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా సంక్రాంతి పోటీలో నిలిచి ప్రేక్షకుల నుంచి సరైన విజయం అందుకోలేకపోయింది .. తర్వాత 2023లో వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి వచ్చి మంచి విజయం అందుకున్నాడు.. ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా డాకు మహారాజ్‌గా బాలయ్య సంక్రాంతి పోటీలో దిగుతున్నాడు .. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: