ఈ మధ్యకాలంలో సినిమాలు విడుదలయ్యాక ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో వాటికి సంబంధించిన పోస్టర్లు వేసుకోవడం ట్రెండ్ గా మారిపోయింది. అయితే అవి నిజమైన లెక్కలు అయితే పర్లేదు..కానీ కొంతమంది అయితే అత్యుత్సాహంతో వచ్చిన కలెక్షన్లకు డబల్ కలెక్షన్స్ వేసి చూపిస్తూ సినిమాపై కలెక్షన్ లలోనే హైప్ పెంచి థియేటర్లకు జనాలు వచ్చేలా చేస్తున్నారని చాలామంది అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో తాజాగా ఒక చర్చ జరుగుతుంది.అదేంటంటే..జనవరి 10న విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాను చూసి చాలామంది అస్సలు బాలేదు అని రివ్యూ ఇచ్చారు. అయితే అలాంటిది ఈ సినిమాకి సంబంధించి హిందూ టైమ్స్ న్యూస్ వాళ్ళు 50 కోట్లు కూడా మొదటిరోజు కలెక్షన్లు సంపాదించలేదంటే చిత్ర యూనిట్ వాళ్ళు మాత్రం అఫీషియల్ గా 186 కోట్లు వరల్డ్ వైడ్ గా గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్ వసూలు చేసింది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

అయితే ఈ పోస్టర్ చూసి సోషల్ మీడియాలో చాలామంది నెగటివ్ పోస్టులు పెడుతున్నారు. అసలు 100 కోట్లు కూడా దాటని ఈ సినిమాకి ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాకు వచ్చింది 86 కోట్ల గ్రాస్ మాత్రమే నట.కానీ చిత్ర యూనిట్ వారు 100 కోట్లు యాడ్ చేసి 186 కోట్ల పోస్టర్ వేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.అంతే కాదు ఒక సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో అన్ని కోట్లతోనే పోస్టర్ రిలీజ్ చేయాలి.కానీ టాక్ బాగాలేని సినిమాకి కూడా అలా ఎక్కువ కోట్లు పెట్టి పోస్టర్లు వైరల్ చేస్తే ఎలా.. దేవర సినిమాకి ఫస్ట్ డే 131కోట్లు వస్తే 41 కోట్లు ఆడ్ చేసి 172 కోట్లు వచ్చాయని ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేశారు.ఇక తాజాగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమాకి కూడా ఫేక్ పోస్టర్లు వేశారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.

 అంతే కాదు ఇలాగే పోస్టర్లు వేసుకుంటూ ఫేక్ ప్రచారం చేస్తే మాత్రం ముందు ముందు రోజుల్లో సినిమాలు చూడడానికి కూడా జనాలు రారు. అసలు కలెక్షన్స్ విషయాన్నీ కూడా పట్టించుకోరు అని చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ప్లాప్ టాక్ వచ్చిన ఆ సినిమాకి అన్ని కోట్ల కలెక్షన్స్ అంటే ఫేకే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.ఇక బన్నీ నటించిన పుష్పటు సినిమాకి 294 కోట్లు వచ్చాయంటే నమశక్యమేనని ఎందుకంటే అందులో బన్నీ నట విశ్వరూపం చూసారని చాలామంది అల్లు అర్జున్ ని ఇందులోకి లాగి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫేక్ కలెక్షన్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి చూడాలి గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ నిజంగానే ఫేక్ పోస్టర్ రిలీజ్ చేసిందా..కనీసం 86 కోట్లు కూడా ఈ సినిమాకి రాలేదా.. 100 కోట్లు ఈ సినిమాకి నిజంగా యాడ్ చేశారా అనే దానిపై నిర్మాత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: