బాలీవుడ్ నటి దీపిక పదుకొనే ఇండస్ట్రీలోకి మొదట ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ ద్వారా కాదు.సౌత్ సినిమాతోనే. అలా సౌత్ ద్వారా ఈ హీరోయిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా మారింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకు రీసెంట్ గానే పాప పుట్టడంతో ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే దీపిక పదుకొనే పై తాజాగా ఓ నటుడు చేసిన అసభ్య కామెంట్లపై దీపిక పదుకొనే అభిమానులు ఫైర్ అవుతున్నారు.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. దీపికా నాలుగో భార్య అవుతుందని ఎందుకు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అంటే చాలామందికి తెలుసు. కే జి ఎఫ్ సినిమాలో అధీర పాత్రలో నటించిన నటుడు అనగానే చాలామంది కి గుర్తుకు వస్తాడు.

 అయితే అలాంటి సంజయ్ దత్ కి ఇప్పటికే ఎన్నో ఎఫైర్లు ఉన్నాయని ఆయన గురించి ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన దాదాపు 300కి పైగా అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నారని యూట్యూబ్ లో ఆయన గురించి పెద్ద పెద్ద వీడియోలే ఉన్నాయి. అలాగే సంజయ్ దత్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే మూడో భార్యతో ఉంటూనే దీపికా పదుకొనే నా నాలుగో భార్య అయ్యేది అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అలా మాట్లాడడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సంజయ్ దత్ ఓ పబ్లిక్ మీటింగ్లో మీడియా ముందు మాట్లాడుతూ..నా ఏజ్ చిన్నదైతే నేను దీపిక పదుకొనేని నాలుగో పెళ్లి చేసుకునే వాడిని.దీపిక ఎంతో అందంగా ఉంటుంది.

ఆమె అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నేను నటించిన ఖల్ నాయక్ మూవీలో చోళీ కే పీచే అనే పాటలో మాధురి దీక్షిత్ ని కాకుండా దీపిక పదుకొనేని తీసుకునేవాడిని. నేను కొంచెం చిన్నవాడిని అయితే ఆమె నాలుగో భార్య అయ్యేది అంటూ అసభ్య కామెంట్లు చేశారు.అయితే ఈయన మాటలపై చాలామంది దీపిక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.నీకు ఒక్కరు చాలా రా.. మా హీరోయిన్ పై అలాంటి వ్యాఖ్యలు చేస్తావా..ఇలాంటి మాటలు ఎవరైనా పబ్లిక్ గా మాట్లాడతారా అంటూ సోషల్ మీడియాలో సంజయ్ దత్ ని తిడుతున్నారు. అంతేకాదు అందరిలో ఇలా మాట్లాడితే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకెలా ప్రవర్తిస్తావో అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై అప్పట్లో చాలానే రూమర్లు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: