హృతిక్ ,సాబా ఇద్దరూ కూడా ఎప్పటిలాగానే తమ రొమాంటిక్ యాంగిల్స్ లో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే హృతిక్ రోషన్ పుట్టినరోజు నిన్నటి రోజున కావడంతో ఆసమయంతో తన గర్ల్ ఫ్రెండ్ సాబ తో ప్రత్యేకంగా జరుపుకున్నట్లు కనిపిస్తోంది.అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సబా ఆజాద్ కూడా వరుసగా హృతిక్ రోషన్ ఫోటోలను షేర్ చేసింది. బీచ్ లో ఈ జంట పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
సభ ఆకుపచ్చ తెలుపు చారల బికినీ ధరించి తన అందాలను వలకబోస్తూ ఉండగా హృతిక్ రోషన్ తో సెల్ఫీ దిగింది. అయితే హృతిక్ రోషన్ కి కూడా తన మాజీ భార్య సున్సానే ఖాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. హృతిక్ రోషన్, సబా ఆజాద్ 2022 నుంచి డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి ఆ తర్వాత అక్టోబర్ 2022లో వీరి బంధాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అధికారికంగా తెలియజేశారు. మొదట లండన్ లో వెకేషన్ కి వెళ్ళిన ఈ జంట ఆ తర్వాత వీరి రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొత్తానికి బీచ్ లో ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు.