ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేయవలసి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇంచుమించు ఓకే అయింది అని అంటున్నారు. మహాభారతంలోని ఒక చిన్న కథను ఆధారంగా చేసుకుని ఇప్పటి వాస్తవిక పరిస్థితులకు అన్వయిస్తూ త్రివిక్రమ్ స్టైల్ లో ఈమూవీ ఉంటుంది అని అంటున్నారు.
అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే షూటింగ్ మొదలుపెడితే వచ్చే ఏడాది విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ అని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసినీ నిర్మాణంలో నిర్మింపబడే ఈమూవీ అల్లు అర్జున్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీయబడే మూవీగా రికార్డు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఈసినిమా ఇంకా పూర్తి కాకుండానే అల్లు అర్జున్ ముంబై వెళ్లి సంజయ్ లీలా భన్సాలీని కలుసుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.
అత్యంత భారీ సినిమాలను విజువల్ గ్రాండియర్స్ గా కళాత్మకంగా తీస్తాడు అని పేరుగాంచిన భన్సాలీ ఈసారి అల్లు అర్జున్ తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అన్న ఆశక్తి చాలమందిలో ఉంది. ఈమూవీ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాకుండానే అల్లు అర్జున్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించవలసిన సినిమా ఒకటి చర్చలలో ఉంది. ఈమూడు భారీ సినిమాలు పూర్తి అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దీనితో రాబోతున్న బన్నీ లైన్ అప్ మూవీల పై అందరిలోను ఆశక్తి పెరిగిపోతోంది..