ఇటీవలే విడుదలైన రెండు ట్రైలర్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలయ్యతో ఎన్నడూ చూడని, వినని డైలాగులు కూడా ఒక రేంజ్ లో చూపించారట డైరెక్టర్ బాబి. మరి కొన్ని గంటలలో డాకు మహారాజు సినిమా థియేటర్లో ప్రీమియర్ షో పడబోతున్న సందర్భంగా మీడియాతో డైరెక్టర్ బాబి ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
డాకు మహారాజ్ సినిమా షూటింగ్ ఎక్కువగా జైపూర్ లోనే చేశామని అక్కడ చాలా సన్నివేశాలను చిత్రీకరించామంటూ తెలిపారు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాము అయితే హైదరాబాద్ నుంచి రావాల్సిన గుర్రం ఇంకా రాలేదు.. లోకల్ గా ఒక గుర్రాన్ని అప్పటికప్పుడు సెట్ చేసుకున్నామని.. అయితే ఆ గుర్రం మ్యాడ్ గుర్రమని దాని సొంత యజమాని ఇప్పటికే రెండుసార్లు కింద పడేసిందని తెలిపారు డైరెక్టర్ బాబి .ఈ విషయాన్ని విన్న ఫైట్ మాస్టర్ వెంకట్ కూడా ఈ విషయాన్ని బాలయ్యకు చెప్పారట. కానీ బాలయ్య అలాంటివేమీ లెక్కచేయకుండా ఆ గుర్రాన్ని డొక్కలో ఒక తన్ను తన్ని పైకి ఎక్కి మరీ స్వారీ చేస్తూ ఉంటే అందరం ఒక్కసారిగా షాక్ అయ్యామని తెలిపారు డైరెక్టర్ బాబి. దీంతో దెబ్బకి గుర్రం సెట్ అయిపోయిందని ఈ పని వల్ల సినిమా షూటింగ్ కూడా త్వరగా పూర్తి అయ్యిందని.. తెలిపారు డైరెక్టర్ బాబి.