సమంత ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటన, అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించిన ఈ చిన్నది నాగచైతన్యతో ప్రేమ వివాహం తర్వాత హీరోయిన్ గా పెద్దగా అవకాశాలను తెచ్చుకోలేకపోయింది.
నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత ఏవో కొన్ని సినిమాలలో తప్పితే వరుస పెట్టి సినిమాలలో నటించలేదు. దానికి గల ప్రధాన కారణం సమంత పెద్దింటి కోడలు అనే కారణంతో హీరోయిన్ గా పెట్టి సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు భయపడ్డారు. కొన్నేళ్లపాటు సమంత, నాగచైతన్య వారి వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడిపారు. అనంతరం ఏమైందో తెలియదు ఏవో కొన్ని కారణాలతో నాగచైతన్య, సమంత విడిపోయారు.
విడాకుల అనంతరం సమంత వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. కాగా, గత కొన్ని రోజుల క్రితం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోని బయటపడింది. ఇక రీసెంట్ గా సమంత చికెన్ గున్యా బారిన పడిన సంగతి తెలిసిందే.
దాని నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసుకుంది. జ్వరం వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్నీగా ఉందంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. వర్కౌట్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన సమంత అభిమానులు తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.