గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూశారు. గత ఏడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ప్రాజెక్టుని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్లో ముహూర్తాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ పైన పలు రకాల వార్తలు కథలుగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మోక్షజ్ఞ ఎంట్రీని తీసుకున్నారనే విధంగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.


మరొకవైపు బాలయ్య ఆదిత్య-999 మ్యాక్స్ సినిమాతో తన కుమారుడిని లాంచ్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కథనైతే తానే రాసుకున్నప్పటికీ డైరెక్షన్ ఎవరు చేస్తారనే విషయాన్ని ఇంకా బాలయ్య ప్రకటించలేదు. అందుకు తగ్గట్టుగా ప్రాసెస్ అయితే జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైన ఇప్పటివరకు ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ పైన నీలి నీడలు ప్రస్తుతమైతే కమ్ముకుంటున్నట్టు కనిపిస్తున్నాయి.


2025 కొత్త ఏడాదిలోనైనా ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారా లేదా అని నందమూరి అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. మోక్షజ్ఞ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ కోసం ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని ప్రస్తుతం అతడి వయసు 30 ఏళ్లలో ఉందని.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యం తొమ్మిదేళ్లకు పైగా అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 20 ఏళ్లు నిండిన తరువాత తమ వారసులను ఇండస్ట్రీలోకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు సెలబ్రిటీలు. కానీ బాలయ్య కుమారుడు 30 ఏళ్ళు వచ్చేసరికి ఎంట్రీ ఇవ్వడంతో ఈ రకంగా చూసుకుంటే బాలకృష్ణ కుమారుడు చాలా ఎక్స్పీరియన్స్ సైతం కోల్పోయినట్టే అంటూ పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కష్టపడితే స్టార్ డం ఎప్పుడో వస్తుందనే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మోక్షజ్ఞ ఫెయిల్ అయితే హీరో అఖిల్ పరిస్థితి ఎదురవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: