గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. భారీ విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా .. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందే వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు బాబీ. ఈ సినిమా కూడా 2023 సంక్రాంతికి విడుదలైంది. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాను శ్రీకరా స్టూడియో సమర్పణలో.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాబీ డియోల్, ఊర్వశి రౌతేల, చాందిని చౌదరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా సెకండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఇందులో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్లు చేశారు. ఈ చిత్ర బృందం సృష్టించిన డాకు మహారాజ్ ప్రపంచం ఎంతో గొప్పది. చాలా కొత్తగా కూడా ఉంటుంది.  దీనికోసం టీమ్ అంతా కూడా ఎంతో కష్టపడ్డారు.  ముఖ్యంగా కోవిడ్ సమయంలో అఖండ కోసం బాలయ్య ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. డాకు మహారాజ్ కి కూడా ఆయన అంతే కష్టపడ్డారు. కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి సంగీతం చేయాలి అనిపిస్తుంది. అలాంటి చిత్రాలలో డాకు మహారాజ్ కూడా ఒకటి.


ఇక బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. నా జీవితంలో నాకు నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్లే తీరిపోయింది. నేను బాగుండాలని మనస్పూర్తిగా నన్ను దీవిస్తారు. నన్ను ఎంతో నమ్మారు. అందుకే ఆయన సినిమాలకి నేను మరింత బాధ్యతగా మనసుపెట్టి సంగీతాన్ని అందిస్తున్నాను. ఈ సినిమాతో డైరెక్టర్ బాబి కూడా మరో స్థాయికి వెళ్లిపోతారు.  ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం అంటూ తమన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: