అయితే రాజీవ్ కనకాల ఏ సినిమాలో నటించిన.. ఆ సినిమాలో అతను మధ్యలోనే చనిపోతారు. అది ఏ సినిమా అయిన సరే అతని పాత్రని మధ్యలోనే ఖతం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాజీవ్ కనకాల పాత్ర మధ్యలోనే ముగుస్తుంది. అలా రాజీవ్ కనకాల సినిమాలో చనిపోయాడంటే అ సినిమా హిట్టు అన్నట్టుగా మారింది.
ఇదిలా ఉండగా ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాలో రాజీవ్ కనకాల నటించారు. అందరూ సినిమా రిలీజ్ కి ముందే రాజీవ్ కనకాల చనిపోతారని.. అతని పాత్ర మధ్యలోనే క్లోస్ చేస్తారని మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీలో అందరూ అనుకున్నట్లే జరిగింది. రాజీవ్ కనకాల పాత్ర ఈ సినిమాలో కూడా మధ్యలోనే మరణించారు. అయితే ఈ మూవీలో ఆయన కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ పది నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తాడు. ఇక రాజీవ్ కనకాల చనిపోవడంతో సినిమా హిట్ అని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ ఈ సారి గేమ్ ఛేంజర్ సినిమాకు మాత్రం ఇప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దాంతో రాజీవ్ కనకాల సినిమా రిలీజ్ రోజే ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ లో 'సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.. టీంకు ఆల్ ది బెస్ట్' అంటూ రాసుకొచ్చారు. ఆ ట్వీట్ కి జనాలు స్పందిస్తూ.. 'అన్నా ఇందులో కూడా నిన్ను ఏసేశారు.. నీ కారెక్టర్ చనిపోయిందంటే సినిమా హిట్ అని అనుకున్నాం కదా అన్నా; అంటూ కామెంట్లు పెడుతున్నారు.