బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా చిందులు వేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది బాలయ్య డాకు మహారాజ్. సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు సమయం మాత్రమే ఉండడంతో డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా అంటే రేపు థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు మాట్లాడుతూ.... సంక్రాంతికి విడుదలైన తన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయని ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చెప్పారు. అంతేకాకుండా అఖండ-2 సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీకి తన విశ్వరూపం చూపిస్తానని నందమూరి బాలకృష్ణ అన్నాడు.
ఆ తర్వాత వచ్చే సినిమాలు అన్నీ కూడా చరిత్రలో నిలిచిపోతాయంటూ చెప్పాడు. మా నాన్న అభిమానులే నాకు ఇన్స్పిరేషన్. వారందరూ ఇస్తున్న ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు వచ్చాను. ఇలాంటి సినిమాలు చేస్తున్నానని బాలకృష్ణ అన్నారు. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని బాలయ్య బాబు అన్నారు. ఇక ఈ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్ల వద్ద నందమూరి అభిమానులు సందడి చేస్తున్నారు.