గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఇదిలావుండగా ఓవర్సీస్ నుండి ఫ్యాన్స్ షోస్ కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, రెగ్యులర్ షోస్ నుండి కామన్ ఆడియన్స్ యావరేజ్ రేంజ్ టాక్ మాత్రమే వచ్చింది. కొంతమంది ఫ్లాప్ అని కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో బాగా దెబ్బ పడింది కానీ, ఇండియా వైడ్ గా మాత్రం దంచికొట్టేసింది. అర్థరాత్రి షోస్ కారణంగా నూన్ మరియు మ్యాట్నీ షోస్ కాస్త తగ్గిపోయాయి కానీ, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ మాత్రం దుమ్ము లేపేసాయి అని చెప్పొచ్చు. ఈ క్రమంలో నేసరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. కథ, కథనం రెండు కూడా బాలేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా అభిమానులు సైతం సినిమా బాలేదని తేల్చేశారు. అయితే బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమర్ సంధు 'గేమ్ ఛేంజర్' సినిమాపై షాకింగ్ పోస్ట్ చేశారు. తాను 'గేమ్ ఛేంజర్' సినిమా ప్లాప్ అని రెండు నెలల క్రితమే చెప్పానని ఉమర్ సంధు తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. రెండు నెలల క్రితం ఉమర్ సంధు తన పోస్ట్ లో శంకర్ , రామ్ చరణ్‌ కెరీర్‌లోనే అత్యంత బలహీనమైన సినిమాగా 'గేమ్ ఛేంజర్' ఉందని ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు.బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే & డైలాగ్స్ అన్ని కూడా పేలవంగానే ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు. ఫైనల్‌గా సినిమా టార్చర్ అని తేల్చేశాడు. రెండు నెలల క్రితమే తాను చేసిన పోస్ట్ ను ఉమర్ సంధు రీపోస్ట్ చేశాడు.ఉమర్ సంధు చెప్పినట్టుగానే సినిమా ఏమాత్రం బాలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమర్ సంధు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: