టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ఆంధ్రాలో సినిమాకు ఓ వైబ్ ఇస్తారు. తెలంగాణలో కళ్ళు, మటన్ కు వైబ్ ఇస్తారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో కొంతమంది ఈ మాటలను తప్పు పడుతున్నారు. తెలంగాణ వారిని తిండిబోతులు, తాగుబోతులలాగా దిల్ రాజు చూస్తున్నారంటూ తెలంగాణ ప్రముఖులు ప్రొడ్యూసర్ దిల్ రాజుపై విమర్శలు గుప్పిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఈ విషయం పైన పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ తరుణంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు క్షమాపణలు తెలియజేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యాలను కొంతమంది అపార్థం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డను అయిన నేను నా తెలంగాణ సాంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎందుకు అవమానిస్తాను అంటూ దిల్ రాజు క్లారిటీగా చెప్పాడు.


నిజంగా నా మాటల వల్ల తెలంగాణలోని ప్రజలు బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ దిల్ రాజు వేడుకున్నారు. మన తెలంగాణ సాంప్రదాయాలను నేను తప్పకుండా గౌరవిస్తానని తెలిపారు. నేను తీసిన ఫిదా, బలగం వంటి సినిమాలను తెలంగాణ ప్రజలు ఎంతో బాగా ఆదరించారని దిల్ రాజు అన్నారు. కాగా ప్రొడ్యూసర్ గా రెండు సినిమాలను సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు తీసుకువచ్చారు.


ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతి వస్తున్నాం సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: