ఈ మధ్య కాలంలో సినిమా నటులు జనాల్లోకి వెళ్లాలంటే చాలా సెక్యూరిటీ కావాలి. అలాగే ఈ సోషల్ మీడియా  కారణంగా కూడా ఫేమస్ హీరోలు, హీరోయిన్ లు.. ఓపెన్ గా తిరుగలేని పరిస్థితి వచ్చింది. సినీ ప్రముఖులు, ఫేమస్ అయిన వ్యక్తులు ఎదురు పడితే చాలు అభిమానులు సెల్సీలు అంటూ వెంటబడుతుంటారు. ఇక స్టార్ హీరోలు వస్తున్నారంటే వందల వేల మంది జనాలు ఒక్కదగ్గర గుమ్మిగుడుతారు. ఒకవేళ వీళ్లు ఎక్కడికైనా మాస్క్ పెట్టుకుని వెళ్ళినప్పటికి కూడా.. ఎవరో ఒకరు గుర్తుపట్టే పరిస్తితులు ఉంటాయి.
అయితే ఎలాంటి ఒక సమస్యే మన స్టార్ హీరోకి కూడా ఎదురు అయ్యింది. యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ అంటే జనాల్లో మామూలు క్రేజ్ ఉండదు. ఎన్టీఆర్ తన నటనతో గ్లోబల్ హీరోగా పేరు పొందాడు. అయితే తాజాగా సినీ నటుడు ఎన్టీఆర్ ఓ దేశంలో వీధుల్లో తీరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఎన్టీఆర్ సైతం విదేశాల్లో రోడ్డు మీద తిరుగుతున్న సమయంలో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్  చేయగా..  ప్రస్తుతం అది వైరల్ గా మారింది. 
ఇక అసలు విషయానికి వస్తే.. స్కాట్ లాండ్ చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్ ఒక వీడియో తీసుకున్నాడు. అతను తెలియకుండా తీసిన వీడియోలో ఎన్టీఆర్ కనిపించాడు. ఇక ఆ వీడియోలో చూసిన చాలా మంది ఎన్టీఆర్ కనిపించడంతో.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన హీరో అతడంటూ ఎన్టీఆర్ ను గుర్తించారట. ఆ వీడియోలో నందమూరి తారక రామారావు సామాన్యులతో కలిసి ఓ సింపుల్ మ్యాన్ లా నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. 
ఇప్పటి వరకు స్టార్ హీరో ఎన్టీఆర్ అంత మంది జనాల్లో సింపుల్ గా, ఎలాంటి హడావిడి లేకుండా అలా నడుస్తుండడం చూసిన అభిమానులు..  కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: