మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారం విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్వకత్వం వహించగా, దిల్ రాజు రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది.ముఖ్యంగా సెకండాఫ్‌ తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అంటున్నారు. తమన్ ఇచ్చిన పాటలు, బీజీఎమ్ సైతం పెద్దగా ఆకట్టుకోలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా అభిమానులు దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు మా హీరో జీవితాన్ని నాశనం చేశారంటూ మెగా ఫ్యాన్స్ దర్శకుడు శంకర్‌పై మండిపడుతున్నారు.రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

'నానా హైరానా' సాంగ్ కూడా సినిమాలో పెట్టకపోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు.ఇదిలావుండగా ఇండియన్ 2 సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలవడంతో మళ్ళీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన 'గేమ్ ఛేంజర్' తో తానేంటో చూపించారు. మరి ఈ సినిమా సమయంలోనే కమల్ హాసన్ తో చేసిన భారీ సినిమా ఇండియన్ 2 అలాగే ఇండియన్ 3లు కూడా ఉన్నాయి. అనుకోని విధంగా ఇండియన్ 2 ఫెయిల్యూర్ గా నిలిచింది. అయినప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ ఇండియన్ 3 థియేటర్స్ లోనే రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.కానీ గేమ్ ఛేంజర్ ముందు మాత్రం లైకా వారు కొంచెం ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ హిట్ అయితే అది ఇండియన్ 3కే ప్లస్ అవుతుంది అని చాలా కామెంట్లు వినిపించాయి. గేమ్ ఛేంజర్ ఫలితం ఇండియన్ 3 కి మంచి బజ్ తీసుకురావచ్చనే టాక్ కూడా వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తక్కువ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఇకపోతే రేపు డాకు మహారాజ్ మూవీ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ముందు ముందు మంచి మంచి కలెక్షన్లను సాధిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: