బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం "డాకు మహారాజ్". ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కన్నా ముందు వాల్తేరు వీరయ్య సినిమాతో బాబి కొల్లి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా గత సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాబి డియోల్, ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలను పోషించారు. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది.
ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వాక్యాలు చేశారు. సినీ ఇండస్ట్రీకి తన విశ్వరూపాన్ని చూపిస్తానంటూ అన్నారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. కాగా, ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారట. డాకు మహారాజ్ సినిమాను ఎన్టీఆర్ చూడబోతున్నాడుట. ప్రస్తుతం ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఈ సినిమాను విదేశాలలో వీక్షించబోతున్నారట. ఈ విషయం తెలిసి బాలకృష్ణ అభిమానులు సంబరపడుతున్నారు.