తమిళ స్టార్ హీరో విశాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తమిళంలో, తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా కొద్ది రోజుల నుంచి హీరో విశాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 'మదగదరాజ' సినిమా ఈవెంట్ లో విశాల్ వణుకుతూ కనిపించారు. దీంతో విశాల్ అభిమానులు అతనికి ఏమైంది అని ఆందోళనకు గురవుతున్నారు.


కాగా, విశాల్ జ్వరంతో బాధపడుతున్నాడని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అయినప్పటికీ ఆయనకు అసలు ఏం జరిగింది? జ్వరం వస్తే ఇలా ఎందుకు అయిపోతారు అంటూ అతని అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా 'వాడు వీడు' సినిమా షూటింగ్ సమయంలో హీరో విశాల్ చెట్టు పైనుంచి కింద పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అతని బ్రెయిన్ లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పి, ఆకలి లేమి సమస్యతో బాధపడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.


ఇటీవల అది తీవ్రరూపం దాల్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కారణంగానే ఆయన ఇలాంటి స్థితికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశాల్ హీరోగా, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరో హీరోయిన్లుగా 'మదగదరాజ' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా "చెల్లమే" సినిమాతో హీరోగా పరిచయమైన విశాల్ ఇప్పటివరకు 25 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2023లో విడుదలైన "మార్క్ ఆంటోనీ" సినిమా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాతో విశాల్ ద్వీపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత హరి దర్శకత్వంలో విశాల్ నటించిన "రత్తినం" సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2012లో సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటించిన "మదగదరాజ" సినిమా అప్పుడు రిలీజ్ అవ్వలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కు రూట్ క్లియర్ అయింది. ఈ సినిమాతో విశాల్ మంచి సక్సెస్ అందుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: