భారతదేశంలో టెన్నిస్ స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న సానియా మీర్జా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. టెన్నిస్ ఆటలో ఎన్నో పథకాలను సాధించింది. ఇక సానియా మీర్జా వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితాన్నే కొనసాగిస్తోంది. తన కుమారుడితో కలిసి హైదరాబాద్ లో నివసిస్తోంది. సానియా మీర్జా 14 సంవత్సరాల తన వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. 

సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉండి రిలేషన్ కొనసాగిస్తున్న కారణం వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. సానియా మీర్జాతో విడాకుల అనంతరం షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాడు.

సనాకి కూడా ఇది రెండవ వివాహం కావడం విశేషం. సానియా మీర్జాను రెండో వివాహం చేసుకోవాలని ఆమె సన్నిహితులు ఎంతోమంది సలహాలు ఇచ్చారు. కానీ సానియా మీర్జా వాటిని పట్టించుకోకుండా తన కుమారుడితో కలిసి ఉండడానికే ఆసక్తిని చూపిస్తోంది. కానీ ఇండియన్ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని సానియా మీర్జా రెండో వివాహం చేసుకోబోతుందంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆ వార్తలను సానియా మీర్జా తండ్రి ఖండించారు. కాగా ప్రస్తుతం ఓ తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా డేటింగ్ చేస్తున్నట్లుగా పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.

హీరో ఎవరు అనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి. సానియా తప్పకుండా ఆ హీరోని వివాహం చేసుకోబోతుందనే వాదనలు కూడా చాలానే వస్తున్నాయి. ఈ వార్తలపై సానియా మీర్జా స్పందించకపోయినా ఆ తర్వాత ఈ వార్తలపై సానియా మీర్జా ఏం చెబుతుందో చూడాలి. ప్రస్తుతానికి సానియా మీర్జా ఆ హీరోతో రిలేషన్ కొనసాగిస్తుందంటూ వస్తున్న వార్తలపై స్పందించడం లేదు కాదని కొట్టి పారేయడం లేదు. మరి సానియా మీర్జా ఆ హీరోని నిజంగా వివాహం చేసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: