సంక్రాంతి సినిమాలకు ప్రతి ఏడాది కూడా అభిమానులకు ఫుల్ సందడి ఉంటుంది.. ఈ ఏడాది మొదట జనవరి 10వ తేదీన రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ రోజున నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా విడుదల అవుతోంది. డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. హీరోయిన్స్ గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా డాకు మహారాజ్ సినిమాకి సంబంధించి రెండు ట్రైలర్లను రిలీజ్ చేయక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.




డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి కొన్ని షోలు అప్పుడే కొన్నిచోట్ల పడ్డాయి. ఈ సినిమా చూసిన వారందరూ కూడా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.. వారి టాక్ ప్రకారం ఈ సినిమా కథ మైనింగ్ మాఫియా తో నడిచే స్టోరీ అని.. ఇందులో విరాజ్ సర్వి గా (బాబీ డియోల్ ) నటించారని.. నానాజీ డాకు మహారాజుగా బాలకృష్ణ నటించారని తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక పాపను కాపాడడానికి హీరో ఒక ఇంటికి వెళ్తారు ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించినట్లు వెల్లడించారు.


ఇక నెటిజన్స్ తెలిపిన ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ బాగా వర్క్ అవుట్ అయిందని సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని. ఈ సినిమాలో బాలయ్య మేకవర్ ,యాక్టింగ్ కొత్తగా అనిపిస్తుందని తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా ఉందని తెలుపుతున్నారు. నటీనటులు అందరూ కూడా అద్భుతంగా నటించారని తెలుపుతున్నారు.


మరొక నేటిజన్ మాత్రం.. తమన్ కొట్టిన బిజిఎంకి సినిమా స్టోరీ కి సంబంధం లేదని.. గుర్రం సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయని.. మరొక నేటిజన్ తెలుపుతున్నారు.



మరొక నేటిజన్ ఇది ఇందులో అందరూ అద్భుతంగా నటించారని బాలయ్య మాస్ కా  బాప్ అంటూ తెలియజేశారు. బాలయ్య నాలుగోసారి హిట్ కొట్టారంటూ తెలుపుతున్నారు. మరి పూర్తి రివ్యూ రావాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: