డాకూ మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12 విడుదలైన ఈ సినిమా ఇప్పటికే బెనిఫిట్ షోస్ ప్రీమియర్ షో లు చూసిన చాలామంది జనాలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మరి ఇంతకీ ఈ సినిమా కి టాక్ ఎలా ఉంది..సినిమా గట్టెక్కుతుందా అనేది ఇప్పుడు చూద్దాం.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకూ మహారాజ్ సినిమా లో బాలకృష్ణ ఎలివేషన్లు యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా పండాయని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. అలాగే బాలయ్య అభిమానులకు ఇది ఒక పసందైన సినిమా అని, సంక్రాంతి కి పర్ఫెక్ట్ మూవీ అని, సినిమా లో ఎమోషన్స్ అన్ని బాగున్నాయని, కానీ క్లైమాక్స్ చెత్త గా ఉందని కొన్ని సీన్స్ ముందుగానే ఊహించే విధంగా రొటీన్ కథని ఎంచుకున్నారని అంటున్నారు. 

అయితే బాబి కొల్లి కథని రొటీన్ గా తీసుకున్నప్పటికీ బాలయ్య కి సంబంధించిన భారీ ఎలివేషన్లు ,యాక్షన్ సన్నివేశాలు ,బిజీఎం తో సినిమాని ఈజీగా గట్టెక్కించొచ్చు అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. అయితే డాకూ మహారాజ్ మూవీ లో ఫ్యామిలీ సెంటిమెంట్లు, కళ్ళు చెదిరే ఎలివేషన్లు చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంజాయ్ చేసేలా చేస్తాయి. ఇక ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలా రొటీన్స్ టెంప్లేట్ అయినప్పటికీ సినిమాలో ఉన్న బాలయ్య నటనకి ప్రేక్షకుల ఫీదా అవుతున్నారు.

అలాగే సినిమాకి బిజిఎం తమన్ అద్భుతంగా ఇచ్చారని,బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టు తమన్ బిజిఎం అదిరిపోయింది అంటూ చెబుతున్నారు. ఇక ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఈ సినిమా లాభాల పంట తెచ్చి పెట్టడం ఖాయం అని మాట్లాడుకుంటున్నారు. సినిమా అంత బోరింగ్ అయితే ఏమీ లేదు. బాలకృష్ణ నటన చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ మరికొంతమంది రివ్యూ ఇస్తున్నారు.ఇలా చాలామంది ట్విట్టర్ ద్వార తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: