గత ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ సినిమా రాలేదు.ఎందుకంటే అంతకంటే ముందే దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమా వచ్చింది.ఇక భగవంత్ కేసరి సినిమా తర్వాత ఏపీ ఎలక్షన్స్ రావడంతో బాలకృష్ణ కొద్దిరోజులు రాజకీయాల్లో బిజీ అయిపోయారు.ఆ తర్వాత ఎప్పుడెప్పుడు మళ్ళీ సినిమాల్లో కనిపిస్తారా అని బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు.అలా ఇన్ని రోజుల ఆసక్తికి బాలకృష్ణ డాకూ మహారాజ్ మూవీ తో తెరదించారు. అయితే తాజాగా విడుదలైన డాకూ మహారాజ్ మూవీకి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి.కానీ బాలకృష్ణ ఎలివేషన్స్ చూస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ చిటికెన వేలితో మీసం మెలి వేయాల్సిందే అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ డాకూ మహారాజ్ సినిమా ఎలా ఉంది..నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతుందా..నందమూరి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది ఇప్పుడు చూద్దాం..

 నాగ వంశీ నిర్మాతగా చేసిన డాకూ మహారాజ్ మూవీకి బాబి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించారు.ప్రగ్యా జస్వాల్, ఊర్వశి రౌటేలా, శ్రద్ధ శ్రీనాథ్.. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ కలగలిపి తెరకెక్కిన మూవీనే డాకూ మహారాజ్.ఈ సినిమా ఎమోషన్స్ పరంగా ఫ్యామిలీని చాలా ఆకట్టుకుంటుంది.అలాగే బాలకృష్ణకి ఇచ్చిన ఎలివేషన్లు భయంకరంగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సినిమా స్టోరీ రొటీన్ అయినప్పటికీ చూసే ప్రేక్షకుడికి చాలా ఆసక్తికరంగా ఉంది.అలాగే తమన్ మ్యూజిక్ అయితే ఎంతో అద్భుతంగా ఇచ్చారు. బాలకృష్ణ ఎలివేషన్స్ కి తమన్ మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది.

ఈ సినిమాలో పాప సెంటిమెంట్ అద్భుతంగా పండింది. అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు బాలయ్య నటన చూసి కచ్చితంగా మీసం మెలి వేస్తారు. ఇక ఈ సినిమాకి ముందే డైరెక్టర్ బాబి ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇద్దరు సినిమాకి భారీ హైప్ ని ఇచ్చారు.అంతేకాదు నాగ వంశీ అయితే పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో డాకూ మహారాజ్ మూవీ ఇప్పటివరకు చూడని లెవెల్ లో ఉంటుంది అని,బాబి సినీ కెరీర్ లోనే ఇది ఒక బెస్ట్ మూవీ అంటూ రివ్యూ ఇచ్చేశారు. అయితే నాగవంశీ చెప్పిన లెవెల్ లో ఏమీ లేదు కానీ బాలకృష్ణ నటన చూడడానికి థియేటర్ కు వెళ్లొచ్చు అని ప్రేక్షకులు మిక్స్డ్ రివ్యూ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులకు థియేటర్లోకి వచ్చిన బాలకృష్ణ అభిమానులకు పసందైన విందు అయితే అందించారు

మరింత సమాచారం తెలుసుకోండి: