సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి, నెటిజన్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై మాస్ ప్రేక్షకులను మెప్పించిన సినిమాలే విన్నర్ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
డాకు మహారాజ్ మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎదురులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ షేక్ కావడం పక్కా అని తెలుస్తోంది. తెలంగాణలో ఒకింత ఆలస్యంగా డాకు మహారాజ్ షోలు ప్రదర్శితం కానుండగా ఏపీలో మాత్రం ఉదయం 4 గంటల నుంచి డాకు మహారాజ్ బెనిఫిట్ షోలు ప్రదర్శితమయ్యాయి.
 
ఓవర్సీస్ రివ్యూలు సైతం పాజిటివ్ గా ఉన్నాయి. బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడం అభిమానులకు సైతం ఫుల్ మీల్స్ లా ఉంది. కథ మరీ కొత్తగా ఉందని చెప్పలేం కానీ బాలయ్య అభిమానులు బాలయ్య సినిమా నుంచి ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. డాకు మహారాజ్ ఫైనల్ రేంజ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది.
 
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్యను మించిన హిట్ సాధిసారని నిర్మాత నాగవంశీ చెప్పగా ఎట్టకేలకు ఆ కామెంట్లే నిజం కానున్నాయని తెలుస్తోంది. బాలయ్య సినిమాలు అంటే హీరోయిన్లకు మరీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కవు. ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే ప్రగ్యా జైస్వాల్ కు బెటర్ రోల్ దక్కిందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ తొలిరోజు కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: