డాకు మహరాజ్ సినిమాతో ఈ సంక్రాంతికి.. మరోసారి బాలయ్య సింహ గర్జన చేసాడని చెప్పవచ్చు. బాలయ్య మార్క్ ఎలిమెంట్స్‌తో.. ఓ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాని రూపొందించాడు డైరెక్టర్ బాబీ. ఈ విషయంలో డైరెక్టర్ బాబీ చాలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చును. ఇక ప్రేక్షకులు కోరుకునే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్, వీరోచితమైన ఎలిమెంట్స్, రోమాలు నిక్కబొడుచుకునే డైలాగులతో ఫుల్ డోస్ నింపేశాడు డైరెక్టర్ బాబీ.
ముఖ్యంగా బాలయ్య, తమన్ కాంబినేషన్ థియేటర్లలో మరోసారి దద్దరిల్లిందని చెప్పవచ్చును. బాలయ్య మాసిజంకు బాక్సులు బద్దలయ్యే బీజీఎమ్‌తో ఉర్రూతలూగించేశాడట టాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు తమన్. కాకపోతే.. ‘స్టోరీ’ పాత చింతకాయ పచ్చడే, సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాలు కీలకం అంటున్నారు. అలాగే ఎలక్ట్రిఫయింగ్ క్లైమాక్స్‌తో కొంచెం సంతృప్తిని ఇస్తుందని చెబుతున్నారు. ఫైనల్‌గా ఒక్క మాట.. కింద మీద ఊపు, బాలయ్య బాబు తోపు అన్నట్లుగా ఈ సినిమా ఉందని చెబుతున్నారు.
మాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ స్టైలిష్ చిత్రాన్ని రూపొందించడం అనే ఛాలెంజింగ్ టాస్క్‌ని ఎదుర్కొని, విజయం సాధించాడు దర్శకుడు బాబీ కొల్లి. కానీ ఈ డాకు మహారాజ్ సినిమా చాలా సన్నివేశాలు ఊహించదగినవిగా ఉన్నాయి. ముందే చెప్పేయవచ్చు. మొత్తానికి నందమూరి బాలయ్య... ఈ సంక్రాంతికి హిట్ కొట్టినట్లే అని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో.. డాకు మహారాజ్ హిట్ కావడం గ్యారెంటీ అంటున్నారు.