తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఇకపోతే బాలకృష్ణ 2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ , విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలలో వినయ విధేయ రామ , ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చింది.

దానితో ఈ రెండు సినిమాలు ఆ సంవత్సరం సంక్రాంతి పండక్కు ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపలేకపోయాయి. ఇక ఎఫ్ 2 సినిమాకు బ్లాక్బస్టర్ టాక్ రావడంతో ఆ సంవత్సరం ఈ సినిమా సంక్రాంతి పండుగకు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ , బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి.

అందులో భాగంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10 వ తేదీన విడుదల అయ్యింది. గేమ్ చేజర్ మూవీ నెగిటివ్ టాప్ ని తెచ్చుకుంది. దానితో బాలయ్య సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో అని నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారు. ఇకపోతే ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన డాకు మహారాజ్ సినిమాకు చాలా చోట్ల నుండి అద్భుతమైన పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దానితో 2019 సెంటిమెంటును బాలయ్య "డాకు మహారాజ్" సినిమాతో బ్రేక్ చేశాడు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: