అయితే గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్లు సాధించారు. ఈ మూడు సినిమాలు మాస్ సినిమాలే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. బాలయ్య ఖాతాలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య గత సినిమాలు హిట్టైనా ఈ రికార్డును మాత్రం అందుకోలేదనే చెప్పాలి.
బాలయ్య డాకు మహారాజ్ తో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సునాయాసంగా సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. సాంగ్స్ విషయంలో నిరాశపరిచిన థమన్, బీజీఎం విషయంలో మాత్రం అదరగొట్టారు. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా బెనిఫిట్ షోలు ప్రదర్శితమయ్యాయి.
గేమ్ ఛేంజర్ సినిమాకు ఆశించిన టాక్ రాకపోవడం కూడా ఒక విధంగా మైనస్ అయిందని చెప్పవచ్చు. బాలయ్య డాకు మహారాజ్ కు పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నారని చెప్పాలి. డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద కూడా మహారాజ్ అనిపించుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాలి. బాలయ్య తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారని చెప్పవచ్చు.