గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూసారు.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా లో బాలకృష్ణ కు జోడీ గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌ గా నటించారు. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌ గా నటించారు. ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా నేడు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా రిలీజ్ అయింది..నేడు అర్దరాత్రి నుంచే డాకు మహారాజ్ స్పెషల్ షోస్ పడ్డాయి.. సినిమా చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 

సినిమా లో బాలయ్య స్టైలిష్ లుక్ తో  ఆకట్టుకున్నారని వారు తెలిపారు.దర్శకుడు బాబీ ఓల్డ్ స్టోరీనే తెరకెక్కించిన కథనం తో మాత్రం మెప్పించాడు..బాలయ్య ఊర మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టించాయి.. డాకు మహారాజ్ గా బాలయ్య నట విశ్వరూపం చూపించారు..ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది...తమన్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.. బాలయ్య ఎలివేషన్ కి తమన్ ఇచ్చిన బిజిఎం అదిరిపోయింది.. బాలయ్య ఎలివేషన్స్ కోసం వెళ్లిన ఫ్యాన్స్ తమన్ ఫుల్ మీల్స్ అందించాడు.. బాలయ్య సినిమా అంటే స్పీకర్స్ బద్దలవుతాయి నాకు సంబంధం లేదంటూ రీసెంట్ గా తమన్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.. దానికి తగ్గట్టుగానే మాస్ బిజీఎం తో అదరగొట్టాడు...బాలయ్య ఊచకోత కి ఫ్యాన్స్ మీసం మెలేసి తొడ గొడుతున్నారు..మొత్తానికి తన ఫేవరెట్ సీజన్ సంక్రాంతికి మరో అదిరిపోయే హిట్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: