ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో అనేక మంది హిందీ నటులు నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది తెలుగు సినిమాల్లో నటించి ఆ మూవీల ద్వారా మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి డియోల్ ఒకరు. ఈయన అనేక హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే కొన్ని సంవత్సరాలుగా ఈయన సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలోనే ఈయన రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బాబీ డియోల్ పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉండడంతో ఈ సినిమా ద్వారా ఈ నటుడి క్రేజ్ చాలా వరకు పెరిగింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.

సినిమా ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా చోట్ల నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అలాగే ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించిన బాబి డియోల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు అని ప్రేక్షకులు స్పందిస్తున్నారు. ఇలా ఈ సినిమాలో ఈయన నటన అద్భుతంగా ఉంది అని ప్రశంసలు రావడం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాబి కి తెలుగులో అదిరిపోయే రేంజ్ అవకాశాలు వస్తాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: