గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.అనుమతిచ్చిన మార్నింగ్ స్పెషల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి.. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీనిపై పునరాలోచించాలని చెప్పింది.ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈనెల 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది.ఇకపోతే ఈ మూవి విడుదలైన తొలిరోజు రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.ఇదిలావుండగా గేమ్ ఛేంజర్ సినిమాకు ఇండియాలో తొలి రోజున రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. వాటిలో తెలుగు నుంచి రూ. 41.24 కోట్లు రాగా హిందీ బెల్ట్‌లో రూ. 7.5 కోట్లు, కర్ణాటకలో పది లక్షలు, తమిళంలో 2.12 కోట్లు, మలయాళంలో 3 లక్షలుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే, ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో నెట్ కలెక్షన్స్ ఉంటే అతి తక్కువగా మలయాళంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: