నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రలలో బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షో లు చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడ్డాయి. ఈ మూవీ కి చాలా ప్రాంతాల నుండి మంచి పాజిటివ్ టాక్ కూడా వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుండి ప్రసారం లోకి రానుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేయనుండగా ... తమిళ్ , హిందీ భాషల్లో మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు , తమిళ్ , హిందీ మూడు భాషల ఓ టి టి హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాను కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: