నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి రేసులో నిలిచింది. వాస్తవానికి ఈ సినిమాకు బెన్ఫిట్ షో వేయాల్సి ఉంది. కానీ పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ లో వేసినప్పుడు జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని, ఇటు ఏపీ అటు తెలంగాణ హైకోర్టులు ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 8:00 గంటలకు షో ప్రారంభం అయింది. ఇకపోతే ఇప్పటికే యూఎస్ లో సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ సినిమాపై అదిరిపోయే రెస్పాన్స్ అందిస్తున్నారు.


ముఖ్యంగా వన్ హ్యాండ్ తో బాలయ్య సినిమాను లేపేసారని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా థియేటర్ బిజినెస్ కూడా బాగా జరిగింది.  మరి వాటి వివరాలు ఒకసారి చూద్దాం.

నైజాం - రూ.18 కోట్లు

సీడెడ్ - రూ.16.20 కోట్లు

ఉత్తరాంధ్ర - రూ.8.4 కోట్లు

ఈస్ట్ గోదావరి - రూ.6.30 కోట్లు

వెస్ట్ గోదావరి - రూ.5.0 కోట్లు

కృష్ణ - రూ. 5.6 కోట్లు

గుంటూరు - రూ .7.2 కోట్లు

నెల్లూరు రూ.2.8 కోట్లు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ కలిపి - రూ.69.5 కోట్లు.

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ .5.5 కోట్లు

ఓవర్సీస్  - 8.0 కోట్లు

మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ . 83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను  రాబట్టాలి.  ఇప్పటికే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  మొత్తానికైతే సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య హిట్టు కొట్టబోతున్నారని అటు ఆడియన్స్ ఇటు అభిమానులు పెద్ద ఎత్తున అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించగా..  చాందినీ చౌదరి,  బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: