నందమూరి బాలకృష్ణ హీరో గా బాబీ దర్శకత్వంలో తాజాగా డాకు మహారాజ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ ని ఈ రోజు కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని తమిళ్ , హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షో లు చాలా చోట్ల ప్రదర్శించబడ్డాయి.

వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమాతో వరుసగా బాలయ్య నాలుగో విజయాన్ని బాబి రెండో విజయాన్ని అందుకున్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... బాలయ్య వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సమయంలో అఖండ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇలా వరుసగా మూడు విజయాలను అందుకున్న బాలయ్య తాజాగా డాకు మహారాజ్ సినిమాతో కూడా విజయాన్ని అందుకొని తన ఖాతాలో వరుసగా నాలుగో విజయాన్ని వేసుకున్నాడు అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే బాబి కొంత కాలం క్రితం చిరంజీవి హీరోగా వాల్టేరు వీరయ్య అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత బాబి "డాకు మహారాజ్" సినిమాకు దర్శకత్వం వహించి మరో విజయాన్ని అందుకున్నాడు ఇలా వరుసగా ఈయన రెండో విజయాన్ని డాకు మహారాజ్ మూవీతో అందుకున్నాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: