గత ఏడాది సంక్రాంతికి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలలో చిన్న బడ్జెట్ తో వచ్చిన చిన్న సినిమా హనుమాన్. ఈ మూవీ భారీ బడ్జెట్ సినిమాలన్నింటినీ పక్కన నెట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతేకాదు గత ఏడాది హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమాగా కూడా హనుమాన్ పేరు తెచ్చుకుంది.ఎందుకంటే భారీ బడ్జెట్ కలెక్షన్స్ మాత్రమే దృష్టిలోకి తీసుకోరు. తక్కువ బడ్జెట్ పెట్టినా కూడా ఎక్కువ లాభాలు వచ్చిన సినిమానే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా కాబట్టి హనుమాన్ మూవీ గత ఏడాది హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా సత్తా చాటింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ చెప్పారు. దానికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ టైటిల్ కూడా రిలీజ్ చేశారు. అయితే జై హనుమాన్ మూవీలో కథ మొత్తం దేవుడు హనుమంతుడి పాత్ర చుట్టే తిరుగుతుంది అని ప్రశాంత్ వర్మ చెప్పారు. 

ఆ సినిమాలో ఆంజనేయుడి భక్తుడిగా తేజ కనిపిస్తారని చెప్పారు.అయితే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో రానా, చిరంజీవి వంటి హీరోలు నటిస్తారని రూమర్లు వినిపించినప్పటికీ చివరికి కన్నడ నటుడు కాంతార ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టిని తీసుకున్నారు ప్రశాంత్ వర్మ. ఇక రిషబ్ శెట్టి జై హనుమాన్ మూవీలోకి రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమాపై కేసు నమోదు అయింది.ఇక జై హనుమాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అందులో రిషబ్ శెట్టి శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని కనిపించాడు.

అయితే ఈ పోస్టర్ పై ప్రముఖ లాయర్ మామిడాల తిరుమలరావు మైత్రి నమూవీ మేకర్స్, చిత్ర యూనిట్ పై నాంపల్లి కోర్టులో కేసు వేశారు దేవుడితో ఆటలా.. రిషబ్ శెట్టి ని హనుమంతుడి పాత్రలో అలాగే రివీల్ చేయడం ఏంటి..భవిష్యత్ తరాలు హనుమంతుడు అంటే ఎవరు అంటే అందరూ రిషబ్ శెట్టినే అనుకుంటారు. భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు.హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. హనుమంతుడి పాత్రలో హనుమంతుడి రూపురేఖలు చూపించకుండా రిషబ్ శెట్టి రూప రేఖలు ఎలా చూపిస్తారు అంటూ జై హనుమాన్ చిత్ర యూనిట్ పై కేసు పెట్టారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: