ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన గేమ్ చేంజర్ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన డాకు మహరాజ్ సినిమా కూడా విడుదల అయింది. ఈ రెండు సినిమాలలో గేమ్ చేంజర్ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమాకు లాంగ్ రన్ లో కలెక్షన్లు తగ్గే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ రోజు విడుదల అయిన డాకు మహారాజ్ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వస్తుంది. దానితో ఈ సినిమాకు లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కు పెండింగ్లో ఉన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో అనేది తెలిస్తే ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ ఎవరు అయ్యేది క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. ఇక గేమ్ చేంజర్ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా చాలా భాషల్లో విడుదల కావడం వల్ల ఈ మూవీ కి మొదటి రోజు పెద్ద మొత్తంలో కలక్షన్లు వచ్చాయి. అలాగే సంక్రాంతి సీజన్ కావడంతో మరికొన్ని రోజులు ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ మూవీ కి మంచి కలెక్షన్లు లాంగ్ రన్ లో వచ్చే అవకాశం ఉంది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిసల్ట్ ను బట్టి ఈ సంవత్సరం సంక్రాంతి విన్నారు ఎవరు అనేది తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: