టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన మూవీ "డాకు మహారాజ్". అఖండ సినిమా తర్వాత బాలయ్య ఎక్కడ కూడా తన మార్కును తగ్గించుకోకుండా వస్తున్నాడు . మరి ముఖ్యంగా అఖండ , విరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు ఆయన కెరియర్ కి ఎలా ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే . ఇప్పుడు బాలయ్య నటించిన "డాకు మహారాజ్" సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . కొద్దిసేపటి క్రితమే సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన "డాకు మహారాజ్" సినిమా సూపర్ పాజిటివ్ టాక్ అందుకుంది .


మరి ముఖ్యంగా బాలయ్య నటన ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచింది . బాలయ్య ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. అంతేకాదు బాలయ్య ఈ సినిమాలో డ్యూయెల్ షేడ్స్ లో కనిపిస్తాడు . అటు డాకు మహారాజుగా ఇటు నానాజీగా అదరగొట్టేసాడు . మరీ ముఖ్యంగా " డాకు మహారాజుగా" బాలయ్యను తప్పిస్తే మరెవరిని ఊహించుకోలేం . నట విశ్వరూపం చూపించేశారు . నానాజీగా తన మామూలు డైలాగులు మాత్రమే చెప్పుకోగలిగాడు. అయితే బాలయ్య 'అఖండ' సినిమా నుంచి కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయినా 'డాకు మహారాజ్' సినిమా వరకు ..ఒకే పాయింట్ ని ప్రతి సినిమాలో హైలెట్ గా మారుస్తూ వస్తున్నాడు. 



అదే 'సెంటిమెంట్'. అఖండ సినిమాలో బాలయ్య ఎంత సెంటిమెంట్ ఫెలో గా కనిపిస్తాడో మనకు తెలిసిందే . ఆ తర్వాత రిలీజ్ అయిన విరసింహారెడ్డి .. ఆ తర్వాత రిలీజ్ అయిన 'భగవంత్ కేసరి' ఇప్పుడు రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' అన్ని సినిమాలలో కూడా బాలయ్య సెంటిమెంట్ పాత్రను చూస్ చేసుకున్నాడు . ఒకపక్క మాస్ మరొక పక్క సెంటిమెంట్ రెండు పాత్రలను హైలెట్ చేస్తూ డైరెక్టర్స్ కథను ముందుకు తీసుకెళ్లారు . కానీ బాలయ్య మాత్రం ఎమోషనల్ పాత్రలో లీనమైపోయి జీవించేశారు . జనరల్ గా బాలయ్య అంటే తొడ కొట్టడాలు ..మీసం మెలివేయడాలు.. మాస్ డైలాగులు చెప్పడమే కానీ అఖండ సినిమా నుంచి బాలయ్య లోని స్పెషల్ ఎమోషనల్ బాలయ్య ని కూడా మనం చూస్తున్నాం. దీంతో "డాకు మహారాజ్" సినిమాలోని సెంటిమెంట్ కూడా బాగా వర్క్ అవుట్ అయింది . సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరి చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో...??

మరింత సమాచారం తెలుసుకోండి: