మరీ ముఖ్యంగా బాలయ్య ని "డాకు మహారాజు" గా చూపించిన విధానం అందరిని ఆకట్టుకుంది. బాలయ్య నట విశ్వరూపం థియేటర్స్ లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా చేసింది . సంక్రాంతి కానుకగా "డాకుమహారాజు" సినిమా కొద్దిసేపటికి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . ఫ్యాన్స్ ఈ సినిమా హిట్ అవుతాది అని ముందే ఊహించారు ..కానీ బాలయ్యలో ఇంత మాస్ ఎలివేషన్ బయటపడతాడు బాబి అని జనాలు ఊహించలేకపోయారు . సినిమా వేరే లెవెల్ లో ఉంది . బాలయ్య పెర్ఫార్మెన్స్ థియేటర్స్ లో చూస్తుంటే ఒళ్ళు పూనకాలతో ఊగిపోతుంది అంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .
అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బాలయ్య తర్వాత పొగిడే పేరు "ధమన్". ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాత్ర కీలకంగా మారిపోయింది . ఈ సినిమా ప్రతి సీన్లలల్లో ప్రతి డైలాగ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంది . అసలు బాలయ్య నటనకి తమన్ బిజిఎం కొడితే వేరే లెవెల్ . డాకు మహారాజ్ లో అది మరో లెవెల్ కి ఇంకా తీసుకెళ్లిపోయాడు . సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లి థియేటర్లలో సినిమా చూస్తున్నంతసేపు అభిమానులకి పూనకాల వచ్చేలా చేసింది తమన్ మ్యూజిక్ అని చెప్పడంలో సందేహం లేదు . సినిమా విజయంలో తమన్ కూడా ఓ భాగమయ్యాడు అంటున్నారు జనాలు. అంతేకాదు బాలయ్య సినిమాకి తమన్ బిజిఎం బాగా ప్లస్ గా మారింది అని .. ఒకవేళ బిజిఎం ఏమాత్రం అటు ఇటు అయినా సరే సినిమా టాక్ వేరేలా ఉండేది అని.. థియేటర్స్ లో స్పీకర్స్ బద్దలై పోతున్నాయి అంటూ జై బాలయ్య జై జై బాలయ్య అంటూ ట్విట్టర్ వేదిక సోషల్ మీడియా వేదికగా డాకు మహారాజ్ సినిమాని ఓ రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు..!