- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ , నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సంక్రాంతి పండుగ కానుకగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అల‌రించేందుకు బాల‌య్య మ‌రోసారి సంక్రాంతి రేసు లో నిలిచారు. ఈ సినిమాకు తెలంగాణ కంటే ఆంధ్రా లోనే ముందుగా బెనిఫిట్ షోలు వేశారు.


ఇక సినిమాకు మిగిలిన వాటి కంటే థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. ఇదిలా ఉంటే ఆంధ్రా లో ప‌లు సెంట‌ర్ల లో బాల‌య్య అభిమానుల ర‌చ్చ మామూలుగా లేదు. డాకూ మ‌హారాజ్‌ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ కానుంది. గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్బంగా ఫ్యాన్స్ జంతుబలి ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక బాల‌య్య అభిమానులు అయితే కొన్ని చోట్ల సినిమా హిట్ అవ్వాల‌ని గొర్రె పొట్టేల్లు .. మేక ల‌ను క‌టౌట్ల ముందు బ‌లి ఇచ్చారు.


అలాగే ఈ సారి బాల‌య్య అభిమానులు కాస్త డిఫ‌రెంట్ గా ఆలోచ‌న చేశారు. బాలయ్య కటౌట్‌కు మద్యంతో అభిషేకం చేశారు. డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వెరైటీగా మద్యాభిషేకం చేశారు. బాలయ్య ఫెవరెట్ బ్రాండ్ గా ఇటీవ‌ల కాలం లో బాగా ఫేమస్ అయిన మాన్షన్ హౌస్ బాటిల్ మద్యంతో అభిమానులు హీరో బాలకృష్ణ కటౌట్‌కు అభిషేకం చేశారు. ప్లేస్ ఏదైనా, బాలయ్య ఫ్యాన్స్ అంటే దబిదిదిబిడే అన్న రేంజ్ లో హంగామా చేశారు. ఇక సినిమా కు హిట్ టాక్ రావ‌డం తో ఏపీ - తెలంగాణ - అమెరికా అన్న తేడా లేకుండా బాల‌య్య ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: