ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నటించిన బేబీ దేష్న తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ పాపే సినిమా కథను కూడా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి.. ఈ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ నైనిక తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కూడా బాలయ్యకు మంచి విజయాన్ని అందించింది.
ఇక ఇప్పుడు డాకు మహారాజ్.. ఈ సినిమా కూడా చైల్డ్ ఆర్టిస్టు నేపథ్యంలోనే సాగుతుంది. ఈ సినిమా లో ఢిల్లీ నుండి వచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగర్వాల్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బాలయ్య సినిమాలన్నీ కూడా ఈ మధ్య చైల్డ్ ఆర్టిస్టుల చుట్టూ తిరుగుతూ ఆయనకు లక్కీగా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో అటు వేద అగర్వాల్ కి కూడా మంచి గుర్తింపు లభించింది అని సమాచారం.