స్టార్ హీరో బాలయ్య తన సినీ కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలలో నటించారు. బాలయ్య సినిమాలు అయితే హిట్ అవుతాయని లేదంటే ఫ్లాప్ అవుతాయని చాలామంది భావిస్తారు. అయితే గత కొన్నేళ్లలో కథల ఎంపికలో బాలయ్య మారిన నేపథ్యంలో ఈ హీరో ఖాతాలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు చేరుతున్నాయి. డాకు మహారాజ్ మూవీ పైసా వసూల్ ఎంటర్టైనర్ కాగా బాలయ్య అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు.
 
కథ :
 
సర్కార్ సీతారాం చంబల్ ప్రాంతంలో ఇరిగేషన్ ఇంజనీర్ గా తన భార్యతో కలిసి పని చేస్తుంటారు. అయితే ఆ ఏరియా అంతా ఠాకూర్ కుటుంబం కంట్రోల్ లో ఉండగా ఠాకూర్ కుటుంబం చేసే అక్రమాల వల్ల అక్కడ తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కొరత వల్ల పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను చూసిన సీతారామ్ డాకు మహారాజ్ గా మారి వాళ్ల కష్టాలను ఎలా తీర్చారు ? మదనపల్లెలో ఒక చిన్నారి సంరక్షణ చూస్తున్న నానాజీ (బాలకృష్ణ) ఎవరు. మైనింగ్ కింగ్ (బాబీ డియోల్) కు డాకు మహారాజ్ ఏ విధంగా బుద్ధి చెప్పారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
కథనం - విశ్లేషణ :
 
స్టార్ హీరో బాలయ్య నానాజీ, సీతారాం, డాకు మహారాజ్ పాత్రల్లో కనిపించగా ఈ మూడు పాత్రలకు బాలయ్య న్యాయం చేశారు. సినిమాలో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండగా ఆ సీన్లలో బాలయ్య పర్ఫామెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. డూప్ లేకుండా ఆ సన్నివేశాల్లో నటించడం అంటే ఒకింత సాహసం అనే చెప్పాలి. బాలయ్య కనిపించిన ప్రతి సీన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది.
 
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా సినిమాలో ఉన్నా ముగ్గురికీ సరైన పాత్రలు దక్కలేదనే చెప్పాలి. మిగతా హీరోయిన్లతో పోల్చి చూస్తే ప్రగ్యా జైస్వాల్ కు మరింత బెటర్ రోల్ దక్కిందని చెప్పవచ్చు. బాలయ్య వరుస విజయాల జాబితాలో డాకు మహారాజ్ చేరింది. బాబీ డియోల్ యానిమల్ తర్వాత మరోమారు పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టారు.
 
ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎలివేషన్ షాట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతుండగా డాకు మహారాజ్ సినిమాలో సైతం వాటికి పెద్ద పీట వేశారు. బాలయ్య కెరీర్ లో అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి. బాలయ్య హిట్ సినిమాలైన సమరసింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలకు ఈ సినిమాతో ఒకింత కనెక్షన్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా డాకు మహారాజ్ మూవీ ఉంది.
 
సాంకేతిక నిపుణుల పనితీరు :
 
గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ పని చేస్తున్నారు. బాలయ్య సినిమాలు అంటే థమన్ ప్రాణం పెట్టి పని చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆ మాటలను నిజం చేసేలా థమన్ మరోసారి డాకు మహారాజ్ కు ప్రాణం పెట్టి పని చేశారు. డాకు మహారాజ్ సక్సెస్ విషయంలో థమన్ బీజీఎం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. జైలర్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ ఈ సినిమాకు సైతం అదరగొట్టారు. ఈ సినిమాలో విజువల్స్ హై రేంజ్ లో ఉన్నాయి.
 
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో రాజీ పడలేదు. దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య తర్వాత డాకు మహారాజ్ తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ లెవెల్ లో ఉన్నాయి.
 
 ప్లస్ పాయింట్లు :
 
బాలయ్య నట విశ్వరూపం
 
థమన్ రీరికార్డింగ్
 
సెకండాఫ్
 
మైనస్ పాయింట్లు :
 
ఊర్వశి రౌతేలా పాత్ర
 
మ్యూజిక్
 
లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
 
రేటింగ్ : 2.75/5.0




మరింత సమాచారం తెలుసుకోండి: